అహార తనిఖీలు, నాణ్యతా ప్రమాణాలు, టెస్టుల్లో దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. ఈ విషయం ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదికల్లో వెల్లడైంది. వంద మార్కుల ప్రాతిపదికన మన దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ విభాగాల పనితీరును ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐఏ పరిశీలించింది. ఇందులో తెలంగాణ 35.75 మార్కులతో చివరి పదోస్థానంలో నిలిచింది. అహార నాణ్యత తనిఖీలు, ఇతరాత్ర సేఫ్టీ మెజర్‌మెంట్ నిర్వహణలో తొలిస్థానంలో కేరళ నిలవడా, తమిళనాడు, జమ్ము కశ్మీర్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి. దీనిద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమౌతుంది. లైసెన్సులు, రిజిస్ట్రేషన్ నమోదు, షాంపిల్ సేకరణ ల్యాబ్‌లో పరీక్షలు..ఇలా ఎందులోనూ చూసినా తెలంగాణ అత్యంత వెనుకంజలో ఉన్నట్లు ర్యాంకును బట్టి చూస్తే తెలుస్తుంది. ఇతర టాప్ 5 రాష్ట్రాల్లో వైద్యశాఖ అహార తనిఖీలపై ప్రత్యేక శ్రద్ద చూపి ఎప్పటికప్పుడు ల్యాబ్ పరీక్షలు చేసి ప్రజలకు నాణ్యమైన అహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ అవుతుందా..లేక నిద్రావస్థతో ఉంటుందా అనేది చూడాలి.
అహార తనిఖీల్లో తెలంగాణ 23వ స్థానం

- Advertisment -