Team India :టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడే వారికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు శుభవార్త తెలిపింది. ఇక నుంచి వారికి జీతాలు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ లో ఆడేవారికి ఏడాదికి రూ.6 లక్షల చొప్పున ఇస్తోంది. ఇప్పుడు దానిని రూ.15 లక్షలు చేయాలని నిర్ణయించింది. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల సిరీస్ ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 తరువాత వీరి జీతాలు పెరిగే అవకాశ ఉంది. జీతంతో పాటు బోనస్ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Team India : టెస్ట్ క్రికెటర్ల జీతాలు పెంపు.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే?
- Advertisment -