Teachers Dresscode:ముంబై: ఉపాధ్యాయులు జీన్స్, టీషర్టులు ధరించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రభుత్వం మార్గదర్శకల ప్రకారం ఉపాధ్యాయులు జీన్స్, టీషర్టు లేదా ప్రింట్ లో ఉన్న దుస్తులను ధరించడానికి వీలు లేదు. ఉపాధ్యాయులు పిల్లల ఎదుట డ్రెస్ కోడ్ తో కనిపించాలని తెలిపింది. ముఖ్యంగా యువ ఉపాధ్యాయులు ఫార్మల్ ప్యాంట్, షర్ట్ వేసుకొని టక్ వేసుకొని ఉండాలని తెలిపింది. అలాగే మహిళా ఉపాధ్యాయులు చుడీదార్ లేక సాంప్రదాయ చీరలో ఉండేందుకు ఎంచుకోవాలని తెలిపింది. జనరల్ రెగ్యులేషన్ అనేది మహారాష్ట్రలోని అన్ని పాఠశాలలకు వాటి యాజమాన్యం బోర్డు, అనుబంధం ఉన్న పాఠశాలకు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు తొమ్మిది పాయింట్లు తో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది.
Teachers Dresscode: ఉపాధ్యాయులు జీన్స్, టీషర్టులు ధరించడం నిషేధం..
- Advertisment -