చిన్నారుల సందేహాలు తీర్చిన పమేల సత్పతి
పాఠశాలల్లో అహ్లాద వాతావరణం..
పరిసరాలూ శుభ్రంగా ఉంచాలని సూచన
కరీంనగర్-జనత న్యూస్
ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా మారారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. రామడుగు మండల కేంద్రంలోని పాఠశాలను సందర్శించిన ఆమె..విద్యార్థులను పలు ప్రశ్నలడిగి సమాదానాలు రాబట్టారు. మాథ్స్, ఇతర సబ్జెక్ట్‌లో సందేహాలను నివృత్తి చేశారు కలెక్టర్. జిల్లాలోని రామడుగు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ఆమె గడిపారు. విద్యార్థులకు ఇంగ్లీష్ లో రాయడం, చదవడంలో ఇబ్బందులు ఎదురు కాకుండా స్మార్ట్ ఫోన్ లో వర్డ్ వెబ్ లాంటవి వాడుకోవాలని సూచించారు. పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల తరగతి గదిని సందర్శించి అక్కడి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. పాఠశాలలో విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా సంపూర్ణ సౌకర్యాలను కల్పించాలని అన్నారు. చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు లేకుండా చూసుకోవాలని, తరగతి గదిలో గాలి వెలుతురు బాగా ఉండాలని, అవసరమైతే గదులలో అదనంగా లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆ తరువాత పాఠశాలలో గ్రంథాలయం, తరగతి గదులలోని విద్యార్థులను పలకరిస్తూ, వారి పాఠాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అహ్లాద వాతావరణం నెలకొనేలా విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులకు సూచించారు.
నర్సరీ పరిశీలన..
75వ వన మహోత్సవంలో భాగంగా రామడుగు రైతు వేదిక వద్ద గల నర్సరీని పరిశీలించారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. చిప్పకుర్తి, వెంకట్రావ్ పల్లి గ్రామాలలో నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ గ్రామాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే చర్యలను చేపట్టాలని సూచించారు. కేవలం పండ్ల మొక్కలు మాత్రమే కాకుండా వివిధ రకాల పూల మొక్కలను సైతం నాటాలన్నారు. అనంతరం గాయత్రి పంప్ హౌస్ ద్వారా జరిగే నీటి విడుదలను పరిశీలించి, స్టడీ టూర్ లకు వెళ్లే విద్యార్థలను ఆహ్వానించి వారికి నీటి పంపిణీ గురించిన విషయాలను తెలియజేయాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీధర్, తహసీల్దార్ భాస్కర్, ఎంపిడిఓ రాజేశ్వరి, మండల విద్యాధికారి వేణు కుమార్, హెచ్‌ఎం పద్మజ, ఇతర అధికారులు పాల్గొన్నారు
టీచర్‌గా జిల్లా కలెక్టర్..
- Advertisment -