హనుమకొండ, జనతా ప్రతినిధి
చాలా మందికి పొద్దుకి రెండు మూడుసార్లు టీ తాగడం అలవాటే…. టీ తాగే ముందు ఇది వినండి. టీ పొడిలో పురుగు మందులు, ఎరువుల అనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ ఇటీవల గుర్తించింది. ఇప్పటికే అారోగ్యానికి హాని కలిగించే రసాయణాలున్న మంచురీయా,కబాబ్, పీచు మిఠాయి లాంటి అహార పదార్థాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. తాజాగా టీ స్టాల్ లపై దృష్టి పెట్టిన ఆఫీసర్లు పలు జిల్లాలో నుండి టీ పొడి శాంపిల్స్ సేకరించి పరిశోధన చేస్తున్నారు. మంచి రంగు కోసం టీ డస్ట్ ప్రాసెసింగ్ లో పరిమితికి మించి పురుగు మందులు, ఎరువులు వాడుతున్నట్లు వారి పరిశీలనలో వెల్లడైంది. ఇది క్యాన్సర్ కు దారితీస్తుందని నిపుణులు చెబుతుండగా.. ఏది తినాలో ఏది తినదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇది తింటే ఆరోగ్యం, అది తింటే రోగం వస్తదని చెబుతుండడంతో, మరి ఏది తినాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేరొందిన హోటల్లో ఫుడ్ నిల్వ లపై దాడులు చేస్తున్న క్రమంలో ఫుడ్ ప్రియులకు విస్తూ పోయే నిజాలు బయటపడుతున్నాయి.