- వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య
వరంగల్, జనతా న్యూస్:ఎన్నికల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.మంగళవారం ఎల్.బి.కళాశాల లో ప్రిసైడింగ్ (పి. ఓ),అసిస్టెంట్ ప్రిసైడింగ్ (ఏ.పి.ఓ)అధికారులకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ శిబిరాన్ని వరంగల్ తూర్పు రిటర్నింగ్ అధికారి షేక్ రిజవాన్ బాషా తో కలసి కలెక్టర్ సందర్శించి శిక్షణ విధానాన్ని పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జలాల్లోని 3 అసంబ్లీ నియోజకవర్గాలకు గాను 2036 సిబ్బందిని కేటాయించడం జరిగిందని అన్నారు. వరంగల్ తూర్పు నకు 981 పోలింగ్ సిబ్బందిని కేటాయించి మూడు రోజుల పాటు బ్యాచ్ ల వారీగా తొలి విడత శిక్షణ అందజేయడం జరుగుతున్నదని, ఎన్నికలలో ప్రైసైడింగ్ అధికారులు, సహాయ ప్రైసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని, ఎన్నికల సంఘం రూపొందించిన పుస్తకాన్ని అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, నియమాలను పాటించాలని, ఎన్నికల సంఘం జారీ చేస్తున్న నూతన నిబంధనలు, ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని, ఎన్నికల పట్ల నిర్లక్ష్యం వహించ కూడదని,.పోలింగ్ సందర్బంగా నిర్వహించాల్సిన విధులు ,చేయకూడని వాటిపై అవగాహన ఉండాలన్నారు. శిక్షణ పొందిన రోజు నుండి పోలింగ్ ముగిసే వరకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల పట్ల అధికారులుగా విధులు నిర్వహించే వారికి అన్ని అంశాల పట్ల పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు.
ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులు,సిబ్బంది ఎలాంటి పార్టీలకు అభ్యర్థులకు అనుబంధంగా ఉండకూడదని, ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయబడుతున్నందున జాగ్రత్తగా విధులు నిర్వహించాలని,పోలింగ్ రోజు ,పోలింగ్ ముందు రోజు చేయాల్సిన పనులను చెక్ లిస్ట్ తయారు చేసుకుని,అందుకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, పోలింగ్ సందర్భంగా ప్రతి పి.ఓ తీసుకోవాల్సిన మెటీరియల్, ఈవీఎంల నిర్వహణ, ఓటరు జాబితా మార్కడ్ కాపీ, పిఓ,ఏపిఓ డైరీ, వారి విధులు ,పోలింగ్ కేంద్రం బయట ప్రదర్శించాల్సిన సామాగ్రి, పోలింగ్ కేంద్రంలోకి అనుమతించే వారు, మాక్ పోల్, ఈవీఎం ,వివి ఫ్యాట్ లను ఎలా అనుసంధానం చేయాలి వంటి అన్ని విషయాలు ఒకటికి రెండుసార్లు చదువడంతో పాటు ఆచరాత్మకంగా సాధన చేయాలని అన్నారు. ఫారం లను పూరించే సాధన ఈ శిక్షణలో చేయాలని సూచించారు.
పోలింగ్ కు ఒక్క రోజు ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, విధుల పై స్పష్టత ఉండాలని, ఎన్నికల నిబంధన ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ రోజు, పోలింగ్ ప్రారంభానికి ముందు అన్ని పార్టీల ఏజెంట్లు సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాలన్నారు. ఓటరు జాబితాలో పోస్టల్ బ్యాలేట్, చనిపోయిన వారి వివరాలు, తదితర వివరాలను మార్క్ చేయబడి ఉంటుంది ఓటు వేయడానికి వచ్చే ఓటరు వద్ద ఏపిక్ కార్డుతో (12) రకాల ఇతర ప్రభుత్వ గుర్తంపు పొందిన కార్డులను వినియోగించుకోవచ్చు అన్నారు.
ఈ సందర్భంగా రెండవ సేషన్ లో వివి ఫ్యాట్ లపై ప్రాక్టికల్ గా సిబ్బందికి ఇస్తున్న శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈ ఓ రాం రెడ్డి, తహశీల్దార్ నాగేశ్వర్ రావు, మాస్టర్ ట్రైనీ సందీప్ కుమార్, డి.ఎస్. ఓ.వేణు గోపాల్, సూపరిండెంట్ హబీబ్, ఎన్నికల డి.టి.మధుసూదన్,తదితరులు పాల్గొన్నారు.