హైదరాబాద్, జనత న్యూస్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు వర్షాలు తీపి కబురు చెప్భాపాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులు అటు ఇటుగా అంటే మే 31 నాటికి కేరళ తీరని తాకే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాతే భారత దేశ భూభాగమంతా విస్తరించనున్నాయి. మే 31న కేరళను తాకడంతో నాలుగు నెలల పాటు వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న దేశంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దేశమంతా వ్యాపిస్తాయి. కానీ ఈసారి మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశించి.. సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో సాధారణంగా మే నెలలో ఎండలు దంచి కొడతాయి. కానీ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలను విస్తాయని వెల్లడించింది
రైతులకు తీపి కబురు
- Advertisment -