హైదరాబాద్, జనతా న్యూస్: మాజీ సీఎం కేసీఆర్ కాలికి గాయం కావడంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనను పరీక్షించిన వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కేసీఆర్ ఎడమ కాలు తుంటి భాగంలో బాల్ రీప్లేస్ మెంట్ చేయాలన్నారు. దీనిని సాయంత్రం 4 గంటలు సర్జరీ ద్వారా మారుస్తామని పేర్కొన్నారు. సర్జరీ తరువాత కేసీఆర్ 4 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని, ఆ తరువాత 5 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. కాగా కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సోమాజిగూడలోని యశోధ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆసుపత్రికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడానే ఉందని తెలిపారు. గురువారం రాత్రి కేసీఆర్ బాత్రూంకు వెళ్లే క్రమంలో జారిపడ్డారు. దీంతో అర్ధరాత్రి ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.
కేసీఆర్ కు నేడు సర్జరీ..హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు
- Advertisment -