ప్రారంభించిన బుస్స శ్రీనివాస్
కాశి : దేశ వ్యాప్తంగా ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఆర్య వైశ్య సత్రాలు వెలుస్తున్నాయి. ఆర్యవైశ్య సంఘాలు, ఆ సామాజిక వేత్తలు ప్రత్యేక ఆర్యవైశ్య సత్రాలు, నిత్యాన్నదాన సత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా వేములవాడ ఎస్‌ఆర్‌ఆర్‌కే ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నదాన సత్ర సంఘం ఆధ్వర్యంలో సుప్రసిద్ద వారణాసి కాశీ క్షేత్రంలో వేములవాడ ఆర్యవైశ్య వాసవి సత్రాన్ని ప్రారంభించారు. సిద్దగిరి బాగ్‌లో ఈ సత్రాన్ని వేములవాడ సత్రం అధ్యక్షులు, కృషి రత్న బుస్స శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ ఇతర ప్రతినిధులతో కలసి ప్రారంభించారు. ఆర్యవైశ్యుల కోసం ఈ సత్రాన్ని ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కటకం కిషన్, ఉపాధ్యక్షులు ఉప్పల రమేష్,ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్కూరి శ్రీనివాస్, ఫుడ్ కమిటీ చైర్మన్ బుస్సా దశరథం, కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ నగుభోపోతు రవీందర్ , సేవ కమిటీ చెర్మన్ కటకం జనార్దన్, ప్రత్యేక ఆహ్వానితులు చికోటి శ్రీహరి, ఫుడ్ కమిటీ మెంబెర్ డైత సతీష్ , ఆర్గనైజేషన్ సెక్రటరీ మైలారపు లింబాద్రి, కాశీ ఆర్గనైజేషన్ సెక్రటరీ గౌరయ్య, కొత్త సురేష్ (కోరుట్ల) , జిల్లా కృష్ణ మూర్తి , అంచురి శ్రీనివాస్ , తనుగుల కిషన్, కొమ్మ శంకర్, పాత మహేష్, చికోటి నాగరాజు, మాడురి ప్రసాద్ (సుల్తానాబాద్), కచం కాసినాథ్ ( సిద్ధిపేట) తదితరులు పాల్గొన్నారు.