తెలుగు సినిమా స్టార్ నటుడు సునీల్ ఒకప్పుడు కామెడీతో ప్రేక్షకులను అలరించారు. కానీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో మెప్పించాడు. ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీతో విలన్ గా మారాడు. ఈ సినిమాలో సునీల్ చేసిన పర్ఫామెన్స్ కు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వచ్చింది. దీంతో ఆయనకు ఇతర ఇండస్ట్రీల నుంచి అవకాశాలు వరదలా వస్తున్నాయి. తాజాగా సునీల్ కు మలయాళం నుంచి బెస్ట్ ఆఫర్ వచ్చింది. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఓ మూవీలో సునీల్ విలన్ గా నటించబోతున్నాడు. ఈ మూవీ పేరు ‘టర్బో’. ఈ మూవీలోని సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సునీల్ సీరియస్ లిక్ లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు.
భయంకర విలన్ గా సునీల్.. ఏ సినిమాలోనో తెలుసా?
- Advertisment -