ప్రముఖ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి గురించి చాలామందికి తెలిసిన విషయమే. కొన్ని సామాజిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటుటూ అందరికీ పరిచయమయ్యారు. అయితే తాజాగా ఆమె చేసిన సేవలకు గుర్తింపు దక్కినట్లు అయింది. ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ ఖాతా ద్వారా శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలో సుధా మూర్తి గురించి చాలామంది సెర్చ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె గురించి వివరాల్లోకి వెళితే
సుధా మూర్తి 1950 ఆగస్టు 18న కర్ణాటక రాష్ట్రంలోని సిగ్గాన్ లో జన్మించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో స్వర్ణ పథకం అందుకున్న ఆమె విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత భారత్ లోనే ప్రముఖ కంపెనీ ఐన టెల్కోలో ఉద్యోగం సంపాదించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగం సాధించిన మొట్టమొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.ఇన్ఫోసిస్ ఏర్పాటులో భాగస్వామ్యమైన ఆమె గేట్స్ ఫౌండేషన్ ప్రజా రోగ్య విభాగంలో సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు ఆమె చేసిన సేవలకు పలు పురస్కారాలు అందుకున్నారు.2004లో సామాజిక సేవకు గానూశ్రీ రాజా లక్ష్మీ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్, చెన్నై నుండి అందుకున్నారు. 2006 లో పద్మశ్రీ పురస్కారం , సామాజిక సేవ, దాతృత్వం , విద్యా రంగాలలో ఆమె సేవలకు గౌరవ డాక్టరేటు, ప్రముఖ న్యాయవేత్త సంతోష్ హెగ్డే తో కలిసి గౌరవ న్యాయ డాక్టరేటు అందుకున్నారు.2011లో కన్నడ సాహిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అట్ఠిమబ్బే’ అవార్డు 2023 లో పద్మ భూషణ్ అవార్డు, గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు.