కరీంనగర్- జనత న్యూస్
అందరి సాకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. శాతవాహన అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఆయన సోమవారం పదవీ భాద్యతలు స్వీకరించారు. కరీంనగర్ లోని సుడా ఆఫీసులో ఇంఛార్జి అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ నుండి బాధ్యతలు స్వీకరించిచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క , మంత్రులు శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ,మేడిపల్లి సత్యం, విప్ లు లక్ష్మణ్ కుమార్,ఆది శ్రీనివాస్, విజయరమణా రావు, మక్కాన్ సింగ్ రాజ్ టాగూర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. సుడా పరిధిలోని గ్రామాలతో పాటు నగరంలో విలీన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ప్రతి కార్యకర్త, నాయకులకు అందుబాటులో ఉంటానన్నారు. సడా పరిధిలోని ఆయా గ్రామాల అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు.
సుడా ఛైర్మన్‌గా కోమటి రెడ్డి బాధ్యతలు
- Advertisment -