కోల్‌కతా :
ఎట్టకేలకు విజయం సాధించారు కోల్‌కతా జూనియర్ డాక్టర్లు. ఆర్జీ కర్ ఆసుపత్రి మెడికల్ స్టూడెంట్ ఘటన నేపథ్యంలో విఫలమైన అధికారులను తొలగించాలని పట్టు వదలకుండా చాలా కాలంగా పోరాటం చేశారు. దీంతో సీఎం మమత బెజర్జీ దిగొచ్చి జూడా లతో చర్చలు జరిపారు. 42 మంది డాక్టర్ల బృదం సీఎం నివాసంలో జరిపిన చర్యలు సఫలమైనట్లు సీఎంవో ప్రకటించింది. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్, హెల్త్ డైరెక్టర్ దేబాసిశ్ హల్డర్, హెల్త్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నాయక్‌ను తొలగిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు కోల్‌కతా కొత్త పోలీస్ కమీషనర్‌ను నియమించే అవకాశాలున్నాయి. అయితే సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఆందోళనలు కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెప్పడం మరో మెళిక.
విజయం సాధించిన కోల్‌కతా జూడాలు..!

- Advertisment -