‘తెలంగాణ దర్శిని’కి శ్రీకారం
హైదరాబాద్ :
విద్యార్థులకు చరిత్రపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలోని చారిత్రాత్మక ప్రదేశాలు, వాటి విశిష్టత, చరిత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పర్యాటక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. విద్యార్థులను నాలుగు విభాగాలుగా విభజించి, ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రదేశాలను చూపిస్తారు. ప్రకృతి పర్యాటకం, ఆర్ట్, డ్రాఫ్ట్, సాంస్కృతిక, చారిత్రాత్మక ప్రదేశాల సందర్శనలు నిర్వహిస్తారు. ఈ యేడాది లక్ష మంది వరకు విద్యార్థులు ఆయా ప్రాంతాల్లో సందర్శించేందుకు రూ. 12.10 కోట్లు ఖర్చు చేయనుంది సర్కారు. తొలి కేటగిరిలో రెండు నుండి నాలుగో తరగతి విద్యార్థులు 30 వేల మంది, రెండో కేటగిరిలో 5 నుండి 8వ తరగతి విద్యార్థులు 10 వేల మంది, మూడో కేటగిరిలో 3వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులు 20 వేల మంది, నాలుగో విభాగంలో నాలుగో తరగతి నుండి డిగ్రీ వరకు..ఇలా ఆయా కేటగిరీలుగా విభజించి నాలుగు రోజుల వరకు యాత్ర నిర్వహిస్తారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల లకు చెందిన మొత్తం లక్ష మంది విద్యార్థులు ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశాల్లో విజ్ఞాన విహార యాత్ర చేసేందుకు కార్యచరణ చేపట్టింది సర్కారు.
విద్యార్థులకు విహార యాత్ర..

- Advertisment -