కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టినట్లు అడిషనల్ డీసీపీ పరిపాలన సి రాజు అన్నారు. శుక్రవారం నాడు కరీంనగర్ జిల్లా కేంద్రం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పోలీస్, రెవిన్యూ శాఖ అధికారులు మరియు నియోజక వర్గ ఇతర ఎన్నికల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ నిష్పక్షపాతంగా, ఎన్నికల నియమావళిని కఠినంగా అమలుచేయాలని సూచించారు. చెక్ పోస్ట్ ల వద్ద సిబ్బంది నిర్వహించే విధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పట్టుబడిన వారిపై తీసుకునే చర్యల గురించి వివరించారు
రిటర్నింగ్ అధికారి (ఆర్ డి వో ) కె మహేశ్వర్ మాట్లాడుతూ ఓటర్లు స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రణాళిక బద్దంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఎటువంటి తప్పిదాలు జరగకుండా పూర్తి అవగాహనా కలిగివుండాలని, అమలులో ఏదైనా సందేహాలు తలెత్తితే సంబంధిత పై అధికారులకు తెలిపి వారి ద్వారా నివృత్తి చేసుకోవాలని అన్నారు.. అంతేకాకుండా భారత ఎన్నికల కమిషన్ యొక్క cVIGIL, suvidha అప్లికేషన్ ల వినియోగం పై అధికారుల యొక్క విధుల స్పష్టత గురించి తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ వన్ టౌన్ టూ టౌన్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్లు, రవికుమార్, రామచంద్రరావు, శ్రీనివాస్, కరీంనగర్ అర్బన్, రూరల్ మరియు కొత్తపల్లి తహసీల్దార్లు రమేష్, నవీన్, రాజేష్, ఎంపీడిఓ దివ్యదర్శన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు..