- కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి
కరీంనగర్ క్రైమ్, జనతా న్యూస్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మొదలైనందున, ప్రక్రియ ముగిసే వరకు కమిషనరేట్ వ్యాప్తంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీస్ పరంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు.దీనికి గాను అడిషనల్ డీసీపీ స్థాయి అధికారి ఎ.లక్ష్మీనారాయణను (శాంతి భద్రతలు) నియమించారు. సాధారణ బందోబస్త్ విధుల్లో ఉన్న సిబ్బందితో పాటు, స్పెషల్ టాస్క్ఫోర్స్ టీం లను కేటాయించామని, వారికి నామినేషన్ సెంటర్ వద్ద, ర్యాలీతో వుండేలా విధులు కేటాయించామన్నారు. నగరంలోని సున్నితమైన, శాంతి భద్రతలు సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రూఫ్ టాపుల్లో సిబ్బందిని కేటాయించి బైనాక్యులర్ ద్వారా పర్యవేక్షించేలా, వీడియోకెమెరాల ద్వారా ర్యాలీని చిత్రకరించేలా చర్యలు తీసుకున్నమన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పూర్తిస్థాయిలో ప్రశాంత వాతావరణంలో నామినేషన్ గడువు, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోలీస్ పరంగా అవసరమైన అన్ని భద్రత చర్యలు తీసుకున్నామన్నారు.