20 శాతం వేతన పెపుకు అంగీకారం
తిమ్మాపూర్-జనత న్యూస్
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి హరిత బయో ప్రాడక్ట్ కంపెనీ ఉద్యోగుల సమ్మె సక్సెస్ అయింది. యాజమాన్యం, యూనియన్ ప్రతినిధులతో జరిపిన చర్యలు సఫలం కావడంతో సమ్మె విరమించినట్లు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎడ్ల రమేశ్, మడిపల్లి మహేందర్ తెలిపారు. వేతనాల పెంపు, సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజుల నుండి సమ్మె చేశామని తెలిపారు. ఉద్యోగులకు 20 శాతం వేతనాల పెంపు, పిఎఫ్ ఈఎస్‌ఐ సౌకర్యం, అపాయింట్‌మెంట్ లెటర్స్, ప్లే స్లిప్పులు, బోనస్ , ఓవర్ టైం, సేఫ్టీ షూస్, మెడికల్ ఇన్సూరెన్స్, చట్టపరమైన సెలవులు సాధించుకున్నట్లు తెలిపారు. చర్చల్లో హరిత బయో ప్రొడక్ట్స్ కంపెనీ ప్రతినిధులు సీనియర్ జనరల్ మేజర్ కె వి ఎస్ ఎన్ రెడ్డి, శంకర్ పండిట్, జనరల్ మేనేజర్ కె.వి రంగారెడ్డి, హెచ్‌ఆర్ జగన్మోహన్ నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షులు గిట్ల ముకుంద రెడ్డి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎడ్ల రమేష్, మడిపల్లి మహేందర్, ఉపాధ్యక్షులు గుమ్మడి మహేందర్, రాగుల తిరుపతి, దుడ్డెల సమ్మయ్య అశోక్, కోశాధికారి పూలు సంపత్ సహాయ కార్యదర్శి గంప మధు, నల్ల పవన్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మె సక్సెస్..
- Advertisment -