కరీంనగర్ రోడ్లపై ఇటీవల యువత బైక్ సైలెన్సర్స్ మార్చి ప్రయాణిస్తూ,శబ్ద కాలుశ్యాన్ని కలిగిస్తున్నారని, ఇతర వాహనదారులకు ఇబ్బందికరంగా వ్యవహారిస్తున్నారని తెలిసిందన్నారు. ఈ చర్యలను కట్టడి చేసేందుకుగాను కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఆదేశాల మేరకు కరీంనగర్ పట్టణంలో వన్, టూ, త్రీ టౌన్ పరిధిల్లో గల బైక్ మెకానిక్లందరికీ ఆయా ఇన్స్పెక్టర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బైక్ ల సైలెన్సర్లను మార్చవద్దని సూచించారు. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్స్ ని విక్రయించే వారిపై సైతం చర్యలు తప్పవున్నారు. సూచనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తమవద్దకు వచ్చే నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు నెంబర్ ప్లేట్లను బిగించేలా చూడాలన్నారు. దొంగ బండ్లుగా అనుమానిస్తే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు తెలపలన్నారు.ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ టౌన్ పరిధిలో గల ఇన్స్పెక్టర్లు సరిలాల్ (వన్ టౌన్) , విజయ్ కుమార్(టూ టౌన్), రవి (త్రీ టౌన్ )లు నిర్వహించారు.
బైక్ సైలెన్సర్లు మారిస్తే కఠిన చర్యలు: పోలీస్ కమిషనర్
- Advertisment -