సిద్దిపేట,జనత న్యూస్: రోడ్డుపై రైతులు ధాన్యం అరబోసి నిల్వ చేయడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన సిద్దిపేట రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో అదివారం చోటు చేసుకుంది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన దుబాసి భాను(24)ప్రయివేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.తోర్నాల గ్రామానికి చెందిన రైతులు వాసూరి యాదయ్య,వాసూరి తిరుపతి ఇరువురు తమ వరిధాన్యాన్ని రోడ్డుపై అరబోసి టార్ఫలిన్ కప్పి పెద్ద బండరాళ్లతో రక్షణ ఏర్పాటుచేసి నిల్వ చేశారు.శనివారం రాత్రి సమయంలో దుబాసి భాను తన చెల్లెలు వివాహ వేడుకకు హజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో రోడ్డుపై నిల్వ చేసిన వరిధాన్యాన్ని డీ కొట్టుకుని బండ రాళ్లపై పడి అక్కడిక్కడే మృతి చెందాడు.సంఘటన స్థలాన్ని సీఐ శ్రీను సందర్శించి పరిశీలించారు.ఎలాంటి సూచికలు ఏర్పాటుచేయకుండా తన తమ్ముడి మృతికి కారకులైన రైతులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని మృతుని అన్న ప్రశాంత్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించినట్లు ఏఎస్ఐ పోచ గౌడ్ తెలిపారు.రోడ్లపై ధాన్యం అరబోసిన వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతామని సీఐ శ్రీను తెలిపారు.
రోడ్డుపై ధాన్యం నిల్వ.. బైక్ అదుపుతప్పి ఒకరు మృతి
- Advertisment -