- రహదారిపై నడవాలన్నా వాహన ప్రయాణం చేయాలన్న దుర్గ్రాంధాన్ని భరించాల్సిందే
- కిలోమీటర్ వరకు దుర్గంధం
- రహదారి అనుకొనే మిల్లు వ్యవసాయదారులకు తప్పని తిప్పలు కూలీలు రాక బాధలు
- మత్స్యకారులు పశుల కాపరులు భయాందోళన
- ఎమ్మెల్యే మాట సైతం పెడచెవి
- చెరువును తలపిస్తున్న కలుషిత నీరు
(మానకొండూర్ నియోజక వర్గం- జనత న్యూస్)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళకు వెళ్లే రహదారిలో రోడ్డు పక్కనే ఉన్న తౌడు నుండి వంటనూనె తయారు చేసే ఫ్యాక్టరీ ద్వారా కాలుష్యత నీరు ద్వారా వెద జల్లే దుర్గంధాన్ని పాదచారులు, వాహనదారులు భరించలేకపోతున్నారు . వివరాలలోకి వెళితే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఆ మిల్లు నుండి నూనె తీసే క్రమంలో కలుషిత నీరు ఎక్కువగా వస్తుంది. బయటకు నీరు రాకుండా ఆ మిల్లులోనే ఒక గుంతలో ఆగేలా చేసి వాటిని ఆవిరి చేయించాలి.
ఈ ప్రక్రియ గత కొంతకాలం క్రితం జరుగుతుండేది . కానీ అలా చేయటం వల్ల కరెంటు ఉత్పత్తి ఎక్కువ అవసరం అవుతుంది. బిల్లు ఎక్కువ వస్తుందని సాకుతో ఆ నీటిని బయటకు వదలడంతో పక్కన చెరువుల తయారైంది. ఆ నీరు రోజురోజుకు ఎక్కువ కావడంతో దగ్గరలోనే ఉన్న మోతుకులకుంట చెరువులోకి వెళ్తుంది. ఆ కలుషిత నీటిని పశువులు తాగటంతో గత కొన్ని రోజుల క్రితం ర్యాకం సత్తయ్య అనే రైతుకు చెందిన ఆవు మృతి చెందిందని, తిరుపతి అనే యాదవునికి చెందిన గొర్రె చనిపోయిందని గుగ్గిళ్ళ గ్రామ మాజీ సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్ తెలిపారు. అలాగే మత్స్యకారుల చేపల పెంపకం కూడా సాగటం లేదని అందులోని చేపలను తింటే రోగాల బారిన ఈ ప్రాంత పరిధిలో పడుతున్నారని ఆయన ఆవేదన చెందారు. మిల్లు సమీపంలోని వ్యవసాయదారులు వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలు సైతం దుర్గంధం వస్తుందని రామంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇటీవల జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దృష్టికి మిల్లు విషయమై గ్రామస్తులు అడగగా తాను ఇదివరకే కాలుష్య నివారణ అధికారితో ఫోన్లో మాట్లాడాలని ఆ మిల్లు నుండి వచ్చే నీటిని రాకుండా చేయిస్తా అన్నారని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. మిల్లు యాజమాన్యం మాత్రం కంటి తుడుపు చర్యగా, రోడ్డుపైకి మురుగునీరు రాకుండా పైపులు వేసి కుంటలోకి నీటిని వదులుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్య నుండి కాపాడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.