హైదరాబాద్ :
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో సోదాలు చేపట్టారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో వచ్చిన 16 బృందాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సీఆర్‌పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్యన జూబ్లీ హిల్స్ లోని నివాసం, హిమాయత్ సాగర్‌లోని ఫాం హౌజ్, తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే..ఇందుకు సంబంధించిన వివరాలేవీ అధికారులు వెల్లడించలేదు. దీనిపై రాష్ట్ర మంత్రి స్పందించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల ముందు ఖమ్మం, హైదరాబాద్‌లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి దాడులు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
రాష్ట్ర మంత్రి పొంగులేటి నివాసాల్లో ఈడీ సోదాలు

- Advertisment -