(యాంసాని శివ కుమార్, ఎడిటర్)
శ్రీధర్ బాబు.. మంథని నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన ఈ నేత ఈసారి రేవంత్ రెడ్డి కేబినెట్ లో అత్యంత కీలకమైన శాసనసభా వ్యవహారాలు, ఐటీశాఖ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో శ్రీధర్ బాబుకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు దక్కాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, పొన్నం ప్రభాకర్ లకు మంత్రి పదవులు దక్కించుకొని ప్రభుత్వంలో కీలకంగా మారారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇప్పుడు సీనియర్ గా దుద్దిళ్ల శ్రీధర్ బాబునే కీలకంగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే జిల్లా అభివృద్ధి సంక్షేమం ఆధారపడి ఉంది. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టి అసెంబ్లీ వ్యవహారాల్లో ఆ శాఖ మంత్రిగా వ్యవహరించి కరీంనగర్ జిల్లాకు వస్తున్న శుభ సందర్భంగా శ్రీధర్ బాబుపైనే కరీంనగర్ ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఫోకస్…
- శ్రీధర్ బాబు పొలిటికల్ రికార్డ్..
దివంగత స్పీకర్ శ్రీపాదరావుకు ఆరుగురు సంతానంలో నాలుగోవాడు శ్రీధర్ బాబు. 1969 మే 30న దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బీఏ ఎల్ఎల్ బీ పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ లోనే అనాదిగా ఉంటూ వీరి కుటుంబం ఎంతో సేవ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల చేతిలో శ్రీపాదరావు హత్యతో ఆయన వారసుడిగా శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి వచ్చారు. 1999 ఎన్నికలలో మంథని నుంచి ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబు తొలిసారి గెలుపొందారు. తొలిసారి తన సమీప ప్రత్యర్థి చంద్రుపట్ల రాంరెడ్డిపై 15వేల ఓట్ల తేడాతో గెలిచారు. రెండో టర్మ్ లో 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీధర్ బాబు నాడు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. నాడు 2004లోనూ టీడీపీ అభ్యర్థిని ఓడించి శ్రీధర్ బాబు గెలిచాడు. వైఎస్ఆర్ సర్కార్ లో తెలంగాణలో ప్రభుత్వ విప్ అయ్యారు.
2009లోనూ వైఎస్ఆర్ హయాంలో వరుసగ మూడోసారి గెలిచారు. వైఎస్ఆర్ ఏకంగా మంత్రి పదవి ఇచ్చి శ్రీధర్ బాబును గౌరవించారు. నాడు శాసనసభా వ్యవహారాల మంత్రిగానూ , విద్యాశాఖ మంత్రిగా శ్రీధర్ బాబు వ్యవహరించారు. నాడు తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కీలక పాత్రను శ్రీధర్ బాబు పోషించారు.నాడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక పౌరసరఫరాలు, శాసనసభా వ్యవహారాలు మంత్రిత్వశాఖకు మారారు.
2014లో బీఆర్ఎస్ ఊపులో పుట్టమధు చేతిలో ఓడిన శ్రీధర్ బాబు.. 2018లో అదే పుట్టమధును ఓడించి ప్రతిపక్ష కాంగ్రెస్ లో కీలక భూమిక పోషించారు. ఇప్పుడు 2023లో మరోసారి గెలిచి ఏకంగా కీలకమైన మంత్రిగా అవతరించారు.
పుట్టమధుపైనే ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యత పడింది. జీవన్ రెడ్డి జగిత్యాలలో ఓడడంతో సీనియర్ గా శ్రీధర్ బాబు అవతరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం బాధ్యతలు శ్రీధర్ బాబుపైనే పడ్డాయి. అభివృద్ధి, సంక్షేమంలో కరీంనగర్ కు నిధులు తెచ్చి బాగు చేయాల్సిన పెద్ద టాస్క్ పడింది. సో శ్రీధర్ బాబు ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతాడని.. ఆయన ట్రాక్ రికార్డు, ప్రజాసేవను బట్టి తెలుస్తోంది. జిల్లాకు వస్తున్న సందర్భంగా మనమూ శ్రీధర్ బాబుకు ఆల్ ది బెస్ట్ చెబుదాం.