- 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ పేరు నమోదు చేసుకోవాలి
- కరంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జనతా న్యూస్: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.శనివారం కరీంనగర్ పట్టణంలోని వావిలాల పల్లిలో ఆల్ఫోర్స్, శ్రీ చైతన్య కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శనివారం, ఆదివారం అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఓటరు నమోదు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక క్యాంపును అర్హులైన, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఫామ్ 6 ద్వారా వారి దరఖాస్తును బిఎల్ఓ లకు అందించాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్, ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ సంధ్య రాణి, కరీంనగర్ అర్బన్ తహసిల్దార్ రమేష్, బిఎల్ఓ లు తదితరులు పాల్గొన్నారు.