Saturday, July 5, 2025

సామాజిక సంస్కర్త మహర్షి దయానంద సరస్వతి.. నేడు జయంతి..

హైదరాబాద్, జనతా న్యూస్:నవీన భారతదేశం సంస్కర్తల్లో ఒకరుగా నిలిచారు స్వామి దయానంద సరస్వతి. వేద, వేదాంత విద్యలను చదివి సమాజం పట్ల ఎదుర్కొన్న సమస్యలను చూసి చలించిన ఆయన తన జీవితం ఇక సమాజసేవకే అంకితమని నిశ్చయించుకున్నాడు. సతీసహగమనం, బాల్య వివాహాలపై తీవ్రంగా పోరాడి ప్రజల్లో గణనీయమైన మార్పును తీసుకొచ్చాడు. కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ ను గట్టిగా విశ్వసించే దయానంద సరస్వతి ఆచర్య వ్యవహారాలను మాత్రం వ్యతిరేకించారు. ఆర్య సమాజాన్ని స్థాపించి మహిళా జాతి సముద్దరణకు నడుం బిగించిన దయానంద సరస్వతి 200వ జయంతిని 2024 ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించ వివరాల్లోకి వెళితే..

స్వామి దయానంద సరస్వతి 1824 ఫిబ్రవరి 12న గుజరాత్ లోని ఠంకాగా గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే వేద మంత్రాలు నేర్చుకున్నాడు. తద్వారా తన ప్రాంతంలో ఆధరణీయ వ్యక్తిగా నిలిచాడు. 18వ ఏట చెల్లెలు కలరాతో చనిపోయింది. దీంతో మనిషి చావును ఎందుకు జయించలేకపోతున్నాడు అని అనుకున్నాడు. అదే సమయంలో సమాజంలో ధర్మం పేరుతో జరుగుతున్న మోసాలపై తల్లడిల్లారు. మూఢాచారాలు, మూఢ నమ్మకాలు భారతీయ సమాజాన్ని కబళిస్తున్నాయని ఆలోచించారు.

తన 22వ ఏట వివాహం చేసుకోవాలన్న తండ్రి మాటను వ్యతిరేకించాడు. సుఖ బంధాలు వదిలి సత్యాన్వేషణకు బయలుదేరాడు. వారణాసి వెళ్లి వ్యాకరణం, జ్యోతిష్యం, వైద్యం చదవాలని నిర్ణయించుకున్నాడు.ఈ సమయంలో అతడు యోగులను, సన్యాసులను కలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్నో విద్యలను అభ్యసించాడు. అంధుడైన విజనందుల వద్ద శిష్యరికం చేశాడు. వేదాలు, ఉపనిషత్తులు అధ్యయం చేశాడు. ఈ క్రమంలో అప్పటి వరకు మూల శంకరుడిగా ఉన్న పేరును దయానంద సరస్వతిగా తన గురువు మార్చారు. 1857లో మొదటి సిపాయిల తిరుగుబాటు సందర్భంగా స్పూర్తిని రగిలించాడు. 1867 మార్చి 1న ఫకండా ఖండిని పతాకాన్ని ఆవిష్కరించి హైందవ సమాజంలో ఉన్న దురాచారాలపై పోరాడారు దయానంద సరస్వతి.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page