- స్వపక్షంలో ప్రతిపక్షం
- నిధులు దుర్వినియోగంపై..
మాజీ మేయర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు
కరీంనగర్-జనత న్యూస్
స్వపక్షంలో ప్రతిపక్షంలా వ్యవహరిస్తారు మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్. స్మార్ట్‌సిటీ నిధుల దుర్వినియోగం అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారాయన. కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం బీఆర్‌ఎస్‌లో మరోసారి చర్చకు తెరలేచింది. తన అనుచరులతో కలసి వన్‌టౌన్ పీఎస్‌కు వెల్లిన సింగ్..ఇన్స్‌పెక్టర్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. స్మార్ట్‌సిటీ నిధులను దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. నగరంలోని 60 డివిజన్లను కాదని, పంచాయతీలకు స్మార్ట్‌సిటీ నిధులు కేటాయిండచం నిబంధనలకు విరుద్దమన్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు. దీనిపై స్పందించకుంటే న్యాయ పోరాటం చేస్తామాన్నరు. ఆయన వెంట నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, తదితరులు ఉన్నారు.