Saturday, July 5, 2025

‘ఎంగిలిపూల’ ఉత్సాహం..

ఘనంగా చిన్న బతుకమ్మ సంబరాలు

వేడుకల్లో  పాల్గొన్న మహిళలు, యువతులు

హుజూరాబాద్ /జనతా న్యూస్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు శనివారం హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమ్యాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు, యువతులు ఘనంగా జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను కొలువుదీర్చి చల్లంగా చూడాలని వేడుకుంటూ పూజలు నిర్వహించారు. సాయంత్రం మహిళలు, యువతులు బతుకమ్మలతో ఆలయాలు, ముఖ్య కూడళ్లు, చెరువులు, ఆట స్థలాల వద్దకు చేరుకొని చిన్నా పెద్ద తేడా లేకుండా బతుకమ్మ ఆటలు ఆడుతూ సంబురంగా వేడుకలను జరుపుకున్నారు.

కోరుట్ల లో ..

batukamma korutla
batukamma korutla

జనత న్యూస్, కోరుట్ల: కోరుట్లలో వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట పెట్టి మహిళలు చుట్టూ తిరుగుతూ ఉయ్యాలా పాటలు పాడి సంబురంగా జరుపుకున్నారు.  చిన్న తోటవాడ, ఐలాపూర్ రోడ్డు, ప్రకాశం రోడ్డు, ఆదర్శనగర్ రాంనగర్, గాంధీ రోడ్డు ,కల్లూరు రోడ్డు ,ఝాన్సీ రోడ్డు ,టీచర్స్ క్లబ్ రోడ్డు, రవీంద్ర రోడ్డు, భీముని దుబ్బ పలు వాడల్లో అలాగే మేడిపల్లి, కథలాపూర్, మెట్పల్లి, మల్లాపూర్ తదితర మండలాల్లో పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో నావనంది సంజన ,సుప్రియ, వర్ష ,శిరీష ,లక్ష్మి, కలాల సుమలత ,గుండవేని వనిత, బొమ్మ రూప, అయిండ్ల సంజన, అనుష్క, స్వీటీ తదితరులు పాల్గొన్నారు.

మొదలైన పూల పండుగ సంబురం..

తెలంగాణ రాష్ట్ర పండుగ అయినా బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.కోరుట్ల పట్టణంలో శనివారం lఎంగిలి పూల బతుకమ్మతో అంగరంగ వైభవంగా ప్రారంభమాయ్యాయి.తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంతో ప్రత్యేకమైనది.పల్లె, పట్నం, వాడ అని తేడా లేకుండా తెలంగాణ రాష్ట్రమంతటా తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను మహిళలు, యువతులు జరుపుకుంటారు.శనివారం పెత్ర అమావాస్యతో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.ప్రతి గ్రామం, పట్టణం,వీధిలోనీ ముఖ్య కూడళ్ళల్లో చిన్న పాటి భావి తవ్వి చుట్టూ ముగ్గులు వేసి అందులో తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను పెట్టి వాటి చుట్టూ వలయాకరంగా తిరుగుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టి పడే విధమైన పాటలు పాడుతూ బతుకమ్మ సంబురాలను జగిత్యాలలో ప్రారంభించారు.తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ పండుగ ముగుస్తుంది. మనం దేవునికి పూలను పెట్టి పూజిస్తాం… కానీ పూలనే పూజించే విశిష్ఠమైన సంప్రదాయమే బతుకమ్మ పండుగకు తెలంగాణలో విశిష్టత ఉంది.ఈనెల 22 న సద్ధుల బతుకమ్మ పండుగ సందర్బంగా మహిళలు, యువతులు ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి, బంతి మొదలైన పూలతో బతుకమ్మలను అందంగా తయారు చేసి కొత్త బట్టలు ధరించి జానపదాపాటల రూపంలో ఉన్న ఉయ్యాలా పాటలు పాడుతూ ఈ డుగ జరుపుకోవడం ప్రత్యేకత.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page