రాయికల్, జనతా న్యూస్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని 11వ వార్డులో ఉన్న డ్రైనేజీలో నిండి దుర్గంధం వ్యాపిస్తుందని, దీంతో వార్డు ప్రజలు విష జ్వరాలతో ఇబ్బందుల పాలవుతున్నారని ఆరోతరగతి విద్యార్థిని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. విస్డం స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్న మనహ ముబిన్ మాట్లాడుతూ పట్టణంలోని పలు కాలనీలో డ్రైనేజీ సమస్య ఉందని అన్నారు. చిన్న వయసులోనే బాధ్యతయుతంగా సమస్య పై ఫిర్యాదు చేసిన విద్యార్థినిని పురపాలక సంఘం కమిషనర్ అభినందించారు. సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
డ్రైనేజీ సమస్యపై వినతిపత్రం ఇచ్చిన ఆరోతరగతి విద్యార్థిని
- Advertisment -