కేంద్ర మంత్రి సంజయ్‌కి రాఖీ కట్టిన బీజేపీ మహిళా నాయకురాలు
కరీంనగర్-జనత న్యూస్
అన్నా-చెళ్లె..అక్కా-తమ్ముడి అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్. రాఖీ పౌర్ణమి వేడుకను నిరాడంబరంగా జరుపుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ చైతన్యపురి కాలనీ తన నివాసంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సిరిసిల్ల నియోజక వర్గ ఇంఛార్జి రాణి రుద్రమా దేవి కేంద్ర మంత్రికి రాఖీ కట్టి..అనుబంధాన్ని గుర్తు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న రాణి రుద్రమా దేవిని ఎప్పుడూ అక్కగా పిలుస్తుంటారు మంత్రి బండి సంజయ్. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇలా రాఖీ కట్టగా..సంతోషం వ్యక్తం చేశారు ఆయన. ఈ సందర్బంగా కరీంనగర్ పార్లమెంటు, రాష్ట్ర, దేశ ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.