చీరల ఉత్పత్తికి ముడి సరుకు సప్లై
సిరిసిల్ల` జనత న్యూస్
సిరిసిల్ల పవర్ లూమ్ ఆసాములకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక్కడి కార్మికులకు ఉపాధి కల్పించేందుకు మహిళా సంఘ సభ్యుల చీరల ఉత్పత్తికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన డిజైన్స్,ఇతర విధి విధానాలు రూపు దిద్దుకుంటున్నాయి. దీంతో పాటు నూలు కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వం డిపోను మంజూరు చేసింది. ఇందు కోసం వేములవాడ మండలంలో డిపోను ఏర్పాటు చేయనుంది. చేనేత, టెక్స్‌టైల్స్ ప్రన్సిపల్ సెక్రటరీ శైలజ రామయార్ ద్వారా ప్రభుత్వం జీవో నెంబర్ 18ను శనివారం విడుదల చేసింది. వేములవాడలో యార్న్ డిపో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తూ, ఇందుకు రూ. 50 కోట్ల కార్ఫస్ ఫండ్‌ను రిలీజ్ చేస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది సర్కారు. దీని ద్వారా ఆసాములు చీరల ఉత్పత్తికి అవసరమైన నూలును పొందే అవకాశాలుంటాయి. దీనివల్ల అసాములు పెట్టుబడికి అప్పులు చేసి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు, ఆసాములు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సిరిసిల్లకు యార్న్ డిపో మంజూరు..

- Advertisment -