Saturday, July 5, 2025

‘సిరిసిల్ల వీవర్స్‌ విజన్‌’కు శ్రీకారం

కార్మికులకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
ఇప్పటికే తమిళనాడు వస్త్ర పరిశ్రమపై పరిశీలన
కాంగ్రెస్‌ నేత వెలిచాలను కలసిన యువ పారిశ్రామిక వేత్తలు

కరీంనగర్‌-జనత న్యూస్‌

ఎన్నికలప్పుడు హామీలిచ్చి..ఆ తరువత బుట్టదాఖలు చేస్తున్న నేతలెందరో ఉన్నారు. ఎన్నికయ్యాక కూడా విస్మరించిన ప్రజా ప్రతినిధులూ ఉన్నారు. ఇందుకు భిన్నంగా ఓటమి చవి చూసినా..ఇచ్చిన హామీ మేరకు కార్మికుల సంక్షేమం కోసం తన వంతు సాకారం అందించేందుకు సిద్దపడ్డారు. కరీంనగర్‌ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఓటమి చవి చూసినా..ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు నేత కార్మికులకు శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వాల నుండి పరిష్కారం లభించేలా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల తమిళనాడుకు వెళ్లి స్టడీ చేసిన సిరిసిల్ల యువ పారిశ్రామిక వేత్తలు..కరీంనగర్‌లో కాంగ్రెస్‌ నేత వెలిచాల రాజేందర్‌ రావు కలిశారు. సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్‌ కార్యచరణను ప్రకటించారు.

వెలిచాలను కలసిన యువ పారిశ్రామిక వేత్తలు..
సిరిసిల్లకు చెందిన సుమారు 35 మంది యువ పారిశ్రామిక వేత్తలు శుక్రవారం కాంగ్రెస్‌ పార్లమెంటు ఇంఛార్జి వెలిచాల రాజేందర్‌ రావును కలిశారు. పది రోజులు తమిళనాడు టూర్‌లో పరిశీలించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తిర్పూర్‌, కోయంబత్తూర్‌, సేలం పట్టణాల్లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, అక్కడి ప్రభుత్వాల సాకారం తదితర అంశాలపై వెలిచాలకు వివరించారు.
వస్త్ర పరిశ్రమ ఆధునీకరణపై కార్యచరణ
వచ్చే వారం సిరిసిల్లలో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు వెలిచాల. అనంతరం హైదరాబాద్‌లో టెక్ట్స్‌టైల్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రాయయ్యార్‌, సిరిసిల్ల నియోజక వర్గ ఇంఛార్జి కేకే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌ రావులతో కలసి యువ పారిశ్రామిక వేత్తలు సమావేశ మయ్యేలా కార్యచరణ రూపొందించారు. చివరిగా సీఎం రేవంత్‌ రెడ్డికి వివరించి, ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. టెక్ట్స్‌ టైల్‌ పరిశ్రమ ఆధునీకరణ, డైయింగ్‌, ప్రాసెసింగ్‌ తదితర అంశాలతో పాటు ప్రభుత్వాలు, బ్యాంకర్ల సాకారం..ఇలా ఓ విజన్‌ను ఏర్పాడు చేసుకుని..కార్మికుల సంక్షేమం కోసం పారిశ్రామికులకు అండగా ముందుకు సాగుతున్నారు వెలిచాల.
సిరిసిల్ల వస్త్రాలకు ప్రపంచ స్థాయి బ్రాండ్‌
వస్త్ర వ్యాపార దిగ్గజాలైన చెన్నయ్‌, సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్స్‌, జేసీ బ్రదర్స్‌ లాంటి కార్పోరేట్‌ మాల్స్‌కు సిరిసిల్ల వస్త్రాలు సరఫరా అయ్యేలా విజన్‌ను వెలిచాల రాజేందర్‌ రావు రూపొందించారు. సిరిసిల్ల వస్త్రాలకు ప్రపంచ స్థాయి బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చేలా సరికొత్త, నాణ్యమైన వస్త్రాల తయారీపై దృష్టి సారించే అవకాశాలున్నాయి. సీఎంతో చర్చించి సిరిసిల్ల క్లాత్‌ మర్చెంట్‌ సొసైటికి రూ. 100 కోట్టు కేటాయించేలా భారీ భవన నిర్మాణం చేసే అవకాశాలుంటాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ప్రత్యేక నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయనున్నట్లు తెలుస్తుంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page