సిరిసిల్ల, జనతా న్యూస్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల కాంగ్రెస్ టికెట్ పై సస్పెన్స్ వీడడం లేదు. రాష్ట్రంలో కీలక నియోజకవర్గం సిరిసిల్ల. ఎందుకంటే ఇక్కడ సీఎం కుమారుడు కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కేసీఆర్ పై పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ రుద్రమదేవిని బరిలో నిలిపారు. అయితే కాంగ్రెస్ నుంచి ఎవరా? అనేది తేలడం లేదు. కాంగ్రెస్ టికెట్ కోసం కేకే మహేందర్ రెడ్డి, సంగీతం శ్రీనివాస్, చీటి ఉమేష్ రావులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఎవరికి వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బిజేపీ టికెట్ స్థానికేతరులకు కేటాయించారనికొందరు బీజేపీ నాయకులు బీర్ఎస్ లో చేరారు. ఆ పరిస్థితి తమకు రావొద్దనే ఉద్దేశంతో అప్పుడే టికెట్ కేటాయించొద్దన్నట్లు అధిష్టానం భావిస్తోంది. కానీ నామినేషన్ల పర్వం మొదలైనా.. అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో కాంగ్రెస్ కేడర్ లో ఆందోళన నెలకొంది. అభ్యర్థి ఎవరో తేలిస్తే ప్రచారం నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని కొందరు ఆ పార్టీకి చెందిన నాయకులు వాపోతున్నారు. అయితే కేటీఆర్ ను ఎదుర్కొనే ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణంలో కేటీఆర్ పై పోటీ చేసేందుకు ఎవరు సిద్ధమవుతారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘సిరిసిల్ల’ కాంగ్రెస్ లో ఆందోళన
- Advertisment -