బెజ్జంకి టౌన్,జనత న్యూస్:సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగళ్ళపల్లి, కూరెల్ల, గుండారెడ్డిపల్లి, బస్వాపూర్ గ్రామాల సరిహద్దులలో వెలసిన ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనరసింహ స్వామి వారి జాతర శుక్రవారం ముగిసింది. ఈ ఉత్సవాలకు నలుమూలల నుండి భక్తులు పొటెత్తినారు. సూర్యోదయం నుండి ఏ పలువురు భక్తులు మాయతో మీద వాగులో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు.

మోయ తుమ్మెద వాగు తూర్పు నుండి పడమర వైపుకు దట్టమైన వనమూలికల చెట్ల మధ్య నుండి ప్రవహిస్తుంది. దీనితో ఆ వాగులో స్నానమాచరిస్తే చర్మవ్యాధులు పోతాయని పలువురి భక్తుల నమ్మకం. ఈ వాగు నీటితో చేసిన వంటలు కూడా రుచికరంగా ఉంటాయని ఎక్కువమంది భక్తుల విశ్వాసం.ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరూ కూడా మాంసాహారం తీసుకోరు. ముఖ్య వంటకంగా వంకాయ కూర, చింతపండు చారు ఇలాంటి మసాలా దినుసులు లేకుండా అక్కడున్న కట్టెలతో వంట చేసి, స్వామివారికి నైవేద్యంగా సమర్పించి సహ పంక్తి భోజనాలు చేస్తారు.

సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కొండపైనున్న గృహ మధ్యలో ఉన్న స్వామివారిని మోకాళ్ళపై వెళ్లి పలువురు దర్శనం చేసుకున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలను పోలీసులు తీసుకున్నారు
