సిద్దిపేట,జనత న్యూస్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వాణిజ్య దుకాణాలపై టాస్క్ పోర్స్ అధికారులు మంగళవారం దాడి చేసి రూ.1.30 లక్షల విలువైన సిగరేట్ డబ్బాలను స్వాదీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. సిద్దిపేటలోని నర్సాపూర్ క్రాస్ రోడ్,శ్రీనివాస నగర్ కాలనీలో వాణిజ్య దుకాణాలు నిర్వహిస్తున్న సురేష్ కుమార్(లక్ష్మీ స్టోర్స్) గూడ,శ్రీనివాస్(హరిహర స్టోర్స్) ఇతర ప్రాంతాల నుండి వస్తువులను దిగుమతి చేసుకుని ఎక్కువ ధరకు ప్రజలకు విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి ఇరువురిపై కేసులు నమోదు చేసామని అధికారులు తెలిపారు.ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445,8712667446,8712667447 లకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
సిద్ధిపేట: వ్యాపారులపై టాస్క్ ఫోర్స్ దాడి
- Advertisment -