హుస్నాబాద్,జనత న్యూస్: రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో సైదాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా బీఆర్ఎస్ నాయకులు చేరారు.మంగళవారం సైదాపూర్ మండలాధ్యక్షుడు దొంత సుధాకర్ ఆధ్వర్యంలో వేంకే పల్లి మాజీ సర్పంచ్ మునుపాల రవి,శివరాం పల్లి మాజీ ఎంపీటీసీ అమృత్ సింగ్,వెంకేపల్లి మాజీ వార్డు మెంబర్లు ఆలీటి,శ్రీనివాస్,దుంపేటి ఆంజ నేయులు, గడ్డం శేఖర్, జంపాల సదానందం కాంగ్రెస్ పార్టీలో చేరగా మంత్రి పొన్నం కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల వైస్ చైర్మన్ కొత్త మల్లా రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు వెల్డి రాజు,నాయకులు రాకేష్,తిరుపతి నాయక్, లక్ష్మణ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
సిద్ధిపేట: మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు..
- Advertisment -
