జనత న్యూస్ బెజ్జంకి :మిత్రుని జ్ఞాపకర్థంగా కొందరు స్నేహితులు కలిసి తాము చదువుకున్న పాఠశాలకు ఆర్వో వాటర్ ప్లాంట్ , వాటర్ డిస్పెన్సెర్ ను బహుకరణ చేశారు. మండలంలోని గుండారం గ్రామానికి చెందిన వాసంపెల్లి అశోక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోగా ఆయన జ్ఞాపకంగా చదువుకున్న పాఠశాలకు 40వేల విలువ గల రెండు ఆర్వో వాటర్ ప్లాంట్స్, డిస్పెన్సెర్స్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఎల్లా గౌడ్, పాఠశాల ప్రిన్సిపాల్ నాగమణి, రవి, మిత్రులు సాయి చరణ్, అశోక్,బాబు,మురళి, శేఖర్, రమేష్,అనిల్, నరేష్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
సిద్ధిపేట: స్నేహానికి గుర్తుగా వాటర్ ప్లాంట్ బహుకరణ
- Advertisment -