జనత న్యూస్ బెజ్జంకి : రైతుల పంటలు ఎండుతున్నాయి.. రైతులపై కనికరం లేదా? అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బుధవారం కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూర్ మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ తో కలిసి ఎండిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు బిడ్డ అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కన్నీళ్లు కనిపిస్తలేవా అని ప్రశ్నించారు. అటు వడగండ్ల వాన, ఇటు నీటి ఎద్దడి తో రైతులు ఎంతో నష్టపోయారని నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే రైతులకు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, నాయకులు లింగాల లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు రాజయ్య, మాజీ వైస్ చైర్మన్ హనుమండ్ల లక్ష్మారెడ్డి, లక్ష్మీపురం ఎంపీటీసీ పద్మా రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపిటిసి తిరుపతి రెడ్డి, బేగంపేట మాజీ సర్పంచ్ చింతలపల్లి సంజీవరెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దీటి రాజు, పెద్దోళ్ల శ్రీనివాస్, వడ్డూరు మాజీ సర్పంచ్ నల్వాల అనిత స్వామి, సోషల్ మీడియా ఇంచార్జ్ ఎల శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.