హుస్నాబాద్,జనత న్యూస్: ఉపర్ జై శ్రీరామ్..అందర్ రిజర్వేషన్లకు రాం. .రాం..పాడేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని..దేశంలో ప్రజాస్వామ్యాన్ని,బడుగుల బాసటగా నిలిచే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపైన ఉందని రాష్ట్ర రవాణ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్ యందూ సీపీఐ హుస్నాబాద్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్,సీపీఐ జాతీయ కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి ,సిద్ధిపేట జిల్లా సీపీఐ కార్యదర్శి పవన్ హజరయ్యారు.ఈ సంధర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు.నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదం లో ఉంది.30 సంవత్సరాల తరువాత మోడీ ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా వచ్చింది..ఇప్పుడు ఇస్ బార్ చార్ సౌ అంటున్నాడు.
రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారని ఆరోపించారు.ఎం చేసామో చెప్పుకోకుండా అక్షింతలు వచ్చాయా…? రాముడు ఫోటో వచ్చిందా అడుగుతున్నారని..ఈ నియోజక వర్గానికి ఎం చేసారో చెప్పాలి?మొదటి,రెండవ విడత పోలింగ్ అనంతరం భారత ప్రధాని దిగజారి ట్లాడుతున్నారన్నారు.కాంగ్రెస్ వస్తే ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ఇస్తారని అబద్దాలు ఆడుతున్నారు.. ఆస్తులు గుంజుకుంటారని చెబుతున్నారు..ఎప్పుడైనా చేశామాని ప్రశ్నించారు.
వేములవాడకు మోడీ ఆలయ అభివృద్ధికి ఏదైనా ఇస్తారనుకున్నామని కోటి రూపాయలు కాదు కదా. .ఒక కోడె కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు.బీజేపీ,బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను విస్మరించాయని ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఎంపీగా గెలపించుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం బీజేపీ,బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.సీపీఐ నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.