Siddieta : సిద్దిపేట, జనతా న్యూస్ : సిద్దిపేట పట్టణంలోని ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో ఇటివలే ప్రారంభం అయిన 1000 పడకల ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవల గుర్చి ఆరా తియ్యడానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో జనరల్ వైద్యం, మనోవిజ్ఞాన కన్సల్టెన్సీ, విద్యార్థుల డెమో గది, డివిఎల్ కన్సల్టెన్సీ, ఓపిడి నేత్ర, దంత వైద్యం, వక్రీభవన గది, నమూనా సేకరణ గదులు, పార్మసీ సెంటర్, హెల్ప్ డెస్క్ లను పరిశీలించారు. ప్రజలకు మానవత దృక్పథంతో సేవలు అందించాలని డాక్టర్లకు తెలిపారు. ప్రతి రోగికి సులభంగా తెలిసేవిధంగా హెల్ప్ డెస్క్ సిబ్బంది పని చెయ్యాలి. ఆసుపత్రికి కావలసిన కొన్ని సూచనలు చేశారు.
ఆసుపత్రి మొత్తం ఓక్క సెకను కూడా కరెంట్ పోకుండా విద్యుత్ సరఫరా చెయ్యాలని విద్యుత్ శాఖ ఎస్ఇ కి తెలిపారు. టాయ్లెట్ల్ లలో రన్నింగ్ వాటర్, ప్రతి సీంక్ దగ్గర అద్దాన్ని అమర్చి, ఎక్సిస్టింగ్ ప్యాన్ ల ఏర్పాటు, గదులకు సైన్ బోర్డు ఏర్పాటు, అలాగే ఆసుపత్రిలో ప్రతి డోర్ ముందు మ్యాట్ పెట్టాలని, పాల్ సీలింగ్ పనులు కూడా పూర్తి చెయ్యాలని నిర్మాణ ఏజెన్సీ కి తెలిపారు. ఆసుపత్రి మొత్తం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం అందరి బాధ్యత. అందరు అధికారులు సమన్వయంతో ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న మిగతా పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా పని చెయ్యాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాథామస్, డిఎంఈ రమేష్ రెడ్డి, డిఎం& హెచ్ఓ డా. కాశీనాథ్, టిఎస్ఎంఎస్ఐడిసి డిఈ విశ్వ ప్రసాద్, ఈఈ శ్రీనివాస్, కాంట్రక్టర్ మరియు మెడికల్ కళాశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.