-కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ
తిమ్మాపూర్, జనతా న్యూస్: మహిళలు నిర్భయంగా ఉండాలని, ఎప్పుడైనా మహిళలకు షీ టీం అండగా ఉంటుందని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఆదేశాల మేరకు కరీంనగర్ రూరల్ ఏసీపీ ఆధ్వర్యంలో గురువారం మండలం లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు షీ టీమ్ ఉపయోగాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ వెంకటరమణ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చిన్న వయసులోనే ప్రేమ అనే ట్రాక్ లో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, దాని వల్ల అటు తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా కుంగిపోయి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు.ఎవరైనా లైంగికంగా వేధించినా, ఇబ్బంది పెట్టినా, భయపెట్టినా ధైర్యంగా షీ టీంను సంప్రదించాలని తెలిపారు. మహిళలు, విద్యార్థినులు ఆపద సమయంలో డయల్ 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712670759 ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎలాంటి వేధింపులకు గురైన అమ్మాయిలు మౌనంగా భరించవద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం ని సంప్రదించాలని కోరారు. ఉమెన్ షీ టీమ్ సీఐ శ్రీలత మాట్లాడుతూ నేటి కాలంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా సమస్యను మౌనంగా భరించ కుండా ముందుకు వచ్చి షీ టీమ్ ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సిఐ స్వామి, ఎస్ఐ చేరాలు, కళాశాల జాయిట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళలకు షీ టీం అండగా ఉంటుంది
- Advertisment -