Delhi Polution : దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఇక్కడి వాతావరణం ప్రమాదకరస్థాయికి చేరింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం ఢిల్లీలో మంగళవారం AQI 395 గా నమోదైంది. సాయంత్రం 400 మార్కును దాటింది. బుధవారం సాయంత్రం వరకు మరింత దిగజారుతుందని అంచనా వేస్తున్నాయి. కాలుష్యం పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్ర అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్ర ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. కాలుష్య నివారణకు చక్కటి సలహా ఇచ్చారు. పంట పూర్తయిన తరువాత ఆ వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండాలని అన్నారు. వీటిని తగలబెట్టకుండా దున్నాలని సలహా ఇచ్చారు. ఇలాంటి ప్రత్యామ్నాయాలు ప్రవేశపెడితే కాలుష్యం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహీంద్ర తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మరోవైపు కాలుష్య నివారణకు ప్రభుత్వం సరిబేసి విధానాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని వాహనాలను నగరంలో తిరగకుండా నిషేధించింది. భవన నిర్మాణాలను కూడా ఆపేసింది.
Delhi Polution : ఢిల్లీలో తీవ్రస్థాయిలో కాలుష్యం.. ఆనంద్ మహీంద్రా చక్కటి సలహా..
- Advertisment -