కరీంనగర్, జనత న్యూస్: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో బస్సు కోసం నిలబడి ఉన్న ప్రయాణికులపై డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి దూసుకెళ్లంది. ఈ ఘటనలో చింతగుట్ట గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ ను స్థానికులు బంధించి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉంచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
- Advertisment -