హైదరాబాద్, జనత న్యూస్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపి ఈ మేరకు తీర్పునిచ్చింది. 2022 ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ సమయంలో పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోకున్నా.. తన సంతకాలు ఫోర్జరీ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిని విచారించిన కోర్టు ఇరుపక్షాల వాదనలు విని శుక్రవారం తీర్పును వెల్లడించింది.
హైకోర్టు సంచలన తీర్పు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు
- Advertisment -