- పటిష్టమైన నాయకత్వం
- చెక్కుచెదరని క్యాడర్
- ప్రచారంలో పాల్గొనని నేతలు
- ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగలోకి దిగుతారా?
- పట్టించుకోకపోతే ఓటు బ్యాంకు చీలుతుందా?
- మానకొండూర్ నియోజకవర్గంలో వీరి గురించి తీవ్ర చర్చ
బూట్ల సూర్యప్రకాష్ (మానకొండూరు నియోజకవర్గం ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్):
తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని, దీంతో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ కు పట్టం కడుతుందని ఆశపడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి చల్లారడం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్న సీనియర్ నాయకులు తమను పట్టించుకోవడ లేదని ఎన్నికల్లో చురుకుగా పాల్గొనడం లేదు. అంతేకాకుండా టికెట్ ఆశించి భంగపడ్డ వారిని కనీసం పట్టించుకోకపోవడం చర్చీనీయాంశంగా మారింది.
తెలంగాణలో కరీంనగర్ జిల్లా రాజకీయాలు హీటెక్కిస్తుంటాయి. ఈ జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ లో ఇద్దరు సీనియర్ నాయకుల గురించి తీవ్రంగా చర్చ సాగుతోంది. పార్టీకి చెందిన ఈ ఇద్దరు కొన్ని రోజులుగా ప్రచారం లో కనిపించడం లేదు. వీరిలో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉండి గెలుపు వాకిట వరకు వచ్చి తక్కువ ఓట్ల మెజారిటీతో ఓటమి చెందిన తెలంగణా ఉద్యమ కారుడు ఓరుగంటి ఆనంద్ ఒకరు. అంతకుముందు పార్టీకి సేవలు చేసిన ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 లో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. కనీసం 2018లోనైనా వస్తుందని అనుకున్నారు. కానీ అప్పుడూ నిరాశే ఎదురైంది. అనంతరం ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నామినేటెడ్ పదవి అప్పగించారు. ఈ ఎన్నికల ప్రకటన ముందు వరకు నియోజక వర్గంలోనీ అన్ని మండలాల్లోని కార్యకర్తలతో కలిసి ఉంటూ రాబోయే ఎన్నికలలో తనకే బీ ఆర్ ఎస్ టికెట్ వస్తుందని ప్రతీ కార్యకర్తను కలుస్తూ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తీరా బీ ఆర్ ఎస్ అధినేత సిట్టింగ్ లకే ఎమ్మెల్యే టికెట్ అని రసమయి బాలకిషన్ బీ ఆర్ ఎస్ అభ్యర్థిగా ప్రకటించటం తో ఆనంద్ ఖంగు తిన్నారు.
పార్టీ టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా, అని గతంలో చెప్పుకొన్న ఆనంద్ మాత్రం నేటికీ నియోజక వర్గంలో ఎక్కడా కనిపించడ లేదు. ఆయన అనుచరులు సైతం పలువురు కాంగ్రెస్ గూటికి చేరి పోయారు. ఓరుగంటి ఆనంద్ కు నియోజక వర్గంలో ఒక గుర్తింపు వుంది. ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది.ఇంత జరుగుతున్నా బీ అర్ స్ అగ్ర నాయకత్వం కానీ, రసమయి గానీ పార్టీ ప్రచార పర్వంలో వాడు కొక పోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని పార్టీలో చర్చించుకుంటున్నారు.

అలాగే బెజ్జంకి మాజీ జడ్పీటీసీ, ప్రస్తుత బెజ్జంకి ప్యాక్స్ చైర్మన్ తన్నీరు శరత్ రావు కు నియోజక వర్గం లోని బెజ్జంకి , గన్నేరువరం మండలాల్లో మంచి పట్టు ఉంది. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తమ్ముడిగా పేరు కూడా ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రసమయి వెంట వుండి అన్నీ తానై మంచి మెజారిటీతో గెలుపును అందించాడు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బెజ్జంకి గన్నెరువరం మండలాల్లో ఆయన అనుచరులకు టికెట్లను ఇప్పించారు. కాంగ్రెస్ నుండి గెలిచిన వారిని గులాబీ గూటికి వచ్చేలా ప్రయత్నం చేసి సపలం అయ్యారు. హరీష్ రావు తమ్ముడి గానే కాకుండా ఎన్నో ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లోనే సేవలందిస్తూ జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది ప్రజాప్రతినిధులతోనూ, ఉన్నతా అధికారులతోనూ సంబంధాలు ఉండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైతం మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. కాగా బెజ్జంకి గన్నేవరం మండలాలలో బలమైన క్యాడరును ఏర్పాటు చేసుకున్నారు. కొద్ది రోజుల నుండి రసమయికి శరత్ రావు కు తీవ్ర స్థాయిలో విబేధాలు వచ్చాయని, వారిద్దరూ వీడి పోయారు అనే విషయం బహిర్గతమే. ఈ ఎన్నికల వేళలో నైన కలుస్తారు కావచ్చు అనుకున్న వారికి నిరాశే ఎదురైంది.
నేటికి శరత్ రావు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా పాల్గొన్న దాఖలాలు కనిపించడం లేదు. ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్ లో చేరి పోయారు.కండువాలు మారిన వీరు రంగంలోకి దిగితే ఒక్క పిలుపుతో ఓటు బ్యాంకును పదులపరుచుకునే సత్తా ఉన్న నాయకులు వీరు.
ఇదిలావుండగా.. గన్నెరువరం మండలానికి చెందిన ఆది నుండి బీ ఆర్ ఎస్ వెంట వుండి పార్టీ కార్యక్రమంలో రోడు ప్రమాదానికి గురైన నుస్తులపూర్ మాజీ ప్యాక్ చైర్మన్ అలువల కోటి కూడా ప్రచారం లో కానరావడం లేదు. ఇంత జరుగుతున్నా ట్రైబల్ శూట్టర్గా పేరు పొందిన తన్నీరు హరీష్ రావు గానీ, మాజీ ఎంపీ బోయింపల్లీ వినోద్ రావు గానీ, జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు జి వి రామకృష్ణారావు గానీ పట్టించు కొక పోవటం ఏమిటి అని పలువురు పలువురు చర్చించు కొంటున్నారు.
వీరికి తోడుగా మరో నేత ఇల్లంతకుంట మండలానికి చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు బేంద్రం తిరుపతి రెడ్డి (బీ టీ ఆర్ ఫౌండేషన్) బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడ కానరావడం లేదు. ఆయన బీ టీ ఆర్ ఫౌండేషన్ నెల కొల్పి చాలా సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇల్లంతకుంట మండలంలోని నిరుపేద కుటుంబంలో పెళ్లిళ్లు జరిగితే టేకు మంచాలతో పాటు పెళ్లి సామాగ్రి, వివిధ దేవాలయాల పరిరక్షణ కోసం విరాళాలు, నిరుపేదలకు డబ్బులతో పాటు బియ్యం కూడా పంచుతూ మంచి పేరు సాధించుకున్నారు. అలాగే గత జెడ్పీటీసీ ఎన్నికలలో బీజేపీ నుండి స్వల్ప ఓట్ల మెజారిటీ తో ఓటమి చవి చూశారు. అనంతర పరిణామాలతో బీజేపీ నుండి వైదొలిగారు. కానీ నేటి వరకు ఏ పార్టీ లో చేరలేదు. ఆయనను మచ్చిక చేసుకోవటానికి బీజేపీ తో పాటుగా కాంగ్రెస్స్ బీ ఆర్ ఎస్ తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. చివరికి ఏమవుతుందో ఏమవుతుందో చూడాలి.