Tuesday, July 1, 2025

సీనియర్‌ సిటిజెన్‌ చట్టంలో..

వారి అన్ని బాధ్యతలు, అధికారాలు జిల్లా కలెక్టర్‌కే !
సీనియర్‌ న్యాయమూర్తి వెంకటేశ్‌

కరీంనగర్‌-జనత న్యూస్‌
సీనియర్‌ సిటిజన్‌ చట్టంలో అన్ని బాధ్యతలు, అధికారాలు జిల్లా కలెక్టర్‌కే ఉంటాయని స్పష్టం చేశారు సీనియర్‌ న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి వెంకటేశ్‌. జాతీయ సీనియర్‌ సిటిజన్స్‌ డే సందర్భంగా నగరంలోని సీనియర్‌ సిటిజన్స్‌ డే కేర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వృద్ధుని ఆస్తి, ప్రాణాన్ని రక్షించి, వారు గౌరవ ప్రధంగా జీవించే లాగా భద్రత కలిగించాలని గౌరవ సీనియర్‌ సివిల్‌ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. వెంకటేష్‌ అన్నారు. బుధవారం జిల్లాలోని ప్రతి సీనియర్‌ సిటిజెన్‌(వృద్ధుని) యొక్క ఆస్తిని, ప్రాణాన్ని సంరక్షించి గౌరవప్రదంగా జీవించే విధంగా చూసుకునే బాధ్యత కలెక్టర్‌పై ఉందని తెలిపారు. సమస్యలుంటే సీనియర్‌ సిటిజెన్‌ నేరుగా జిల్లా మేజిస్ట్రేట్‌ కు వినతి పత్రం సమర్పించాలని సూచించారు. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులకు ఆహారం, నివాసం, వైద్యఖర్చులు మొదలగు సదుపాయాలు కలిగించ వలసిన బాధ్యత వారి పిల్లలదే అని తెలిపారు. సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం 2007 చాలా శక్తివంతమైనదని అన్నారు. ఈ విషయంలో వృద్ధులకు ఏ ఇబ్బందులు ఎదురైనా తనను సంప్రదించితే పరిష్కారం సూచిస్తానని అన్నారు. సీనియర్‌ సిటిజన్స్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వుచ్చిడి మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీనియర్‌ సిటిజెన్స్‌ కు ఆరోగ్య సమస్యలుంటాయని, వారి పిల్లలు వైద్య చికిత్స చేయించాలని కోరారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సముద్రాల జనార్దన్‌ రావు మాట్లాడుతూ.. పోలీస్‌ అధికారులు, సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం పై శ్రద్ధ వహించి నట్లయితే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమం లో లీగల్‌ ఏడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ తణుకు మహేష్‌ తో పాటు ప్రధాన కార్యదర్శి పెండ్యాల కేశవ రెడ్డి, ఉపాధ్యక్షులు మోసం అంజయ్య, ఉప్పల రామేశం, సంయుక్త కార్యదర్శులు రాజా చందర్‌, శ్రీధర్‌ స్వామి, కోశాధికారి చింతల సత్యనారాయణ, ఈసీ మెంబర్లు సింగిరెడ్డి లక్ష్మి, రామకృష్ణ రెడ్డి, నర్సింహారెడ్డి, మేనేజర్‌ జి యస్‌ ఆనంద్‌ పాల్గొన్నారు

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page