ఇల్లంతకుంట, జనతా న్యూస్: ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేశారు. సోమవారం రోజున పెద్ద లింగాపురం గ్రామంలో ఎంపీపీ వెంకటరమణారెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నలభై మందిని డ్రా ద్వారా ఎంపిక చేశామని లబ్ధిదారుల కోరిక మేరకు ఈనెల 13న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి చేతుల మీదుగా గృహప్రవేశాలు జరిపించి పట్టా సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జావేద్ హమ్మద్, ఆర్ ఐ షఫీ, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్, విఆర్ఓ సింగారెడ్డి, డైరెక్టర్ గన్నారం వసంతనర్సయ్య ,పసువుల బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
డ్రా ద్వారా డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక
- Advertisment -