న్యూఢిల్లీ, జనత న్యూస్:మరోవైపు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని నగరాన్ని కేంద్ర బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పటికే అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జల్లెడ పట్టేశాయి. ముగ్గురు ఖలిస్థాన్ ఉగ్రవాదులు అయోధ్యలో రెక్కీ నిర్వహించారనే సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. జేషే మహ్మాద్ ఉగ్రవాద సంస్థ అయోధ్యలో రామాలయాన్ని బాబ్రీ మసీదును కూల్యేసి నిర్మిస్తున్నారని..దాని పర్యావసాలు తప్పవని హెచ్చరించిన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
రామ మందిర ప్రతిష్టా మహోత్సవం కోసం ప్రధాని నరేంద్ర మోడీ,ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ కీలక నేతలు,కేంద్ర మంత్రులు,పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,వేలాది మంది విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారు. అందువల్ల ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు ఇప్పటికే అయోధ్యలోని అన్ని ప్రాంతాలను అనువణువు గాలించాయి.