Wednesday, September 10, 2025

స్కూల్ యూనిఫాం స్టిచ్చింగ్ లో..సిరిసిల్ల జిల్లా ఫస్ట్

1800 పాడి పశువుల యూనిట్ల ఏర్పాటు..
స్వశక్తి రుణాలతో ఆర్థికంగా ఎదగాలి
ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాంలో జిల్లా కలెక్టర్‌

సిరిసిల్ల-జనత న్యూస్‌
స్కూల్‌ యూనిఫాం స్టిచ్చింగ్‌లో రాష్ట్రంలోనే రాజన్న సిరసిల్ల జిల్లా ప్రథమంగా నిలిచిందన్నారు జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ రaూ. సమీకృత జిల్లా కలెక్టరేట్‌ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాల ద్వారా 31 యూనిట్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు స్కూల్‌ యూనిఫాం కుట్టించామన్నారు. ఇందులో అగ్రస్థానంలో నిలిచిందని, మహిళా సంఘ సభ్యులను ఆయన అభినందించారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద అందించే రుణాలతో ఆదాయ వనరులను సృష్టించి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు దాదాపు లక్ష కోట్ల రూపాయల రుణాలు అందజేస,ి ఆర్థికంగా వారిని బలోపేతం చేయాలని ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. ప్రస్తుత సంవత్సరం జిల్లాలో ఉన్న మహిళా సంఘాలకు రూ. 500 కోట్ల రుణాలు అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణాలను చిన్నచిన్న వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు వినియోగించాలని కలెక్టర్‌ తెలిపారు. పాడి పశువులు, కుట్టు మిషన్‌ కేంద్రాలు, మీ సేవా కేంద్రాలు, కుటీర పరిశ్రమలు, పౌల్ట్రీ, ఆహార శుద్ధి కేంద్రాలు, హైరింగ్‌ సెంటర్స్‌, మొబైల్‌ ఫిష్‌ రిటైల్‌ అవుట్లెట్స్‌, మిల్క్‌ పార్లర్స్‌, క్యాంటీన్లు, ఈవెంట్‌ మేనేజ్మెంట్‌ ,ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 1800 , ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మరో 600 పాడి పశువుల యూనిట్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, కరీంనగర్‌ మిల్క్‌ డైరీ యూనిట్‌ తో సమన్వయం చేస్తామన్నారు.జిల్లాలో 5123 మైక్రో ఎంటర్ప్రైజెస్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని, ప్రస్తుతం ఉన్న 3392 వ్యాపార యూనిట్ల విస్తరణ, 1607 నూతన వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 120 ఆహార శుద్ధి కేంద్రాలు, 5 కష్టం హైరింగ్‌ సెంటర్లు, 1 మిల్క్‌ పార్లర్‌, 4 అమ్మా క్యాంటీన్లు, 1 ఈ వెట్‌ మేనేజ్మెంట్‌ , 1 ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో 10 నూతన మీ సేవా కేంద్రాలను మహిళలచే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, అదనపు డి ఆర్‌ డి ఓ శ్రీనివాస్‌, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సరిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page