సర్పంచ్ పదవికి రూ. 2 కోట్లట. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ జిల్లాలోని హర్దోవల్ కలన్ అనే గ్రామంలో రూ. 50 లక్షల నుండి వేలం పాట ప్రారంభించగా, బీజేపీ నేత ఆత్మాసింగ్ రూ. 2 కోట్లకు పాట పాడి దక్కించుకున్నాడట. ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చకు తెర లేవగా..అధికార యంత్రాంగం స్పందించినట్లు తెలుస్తుంది. కాగా..పంజాబ్ రాష్ట్రంలో ఈనెల 15న 13, 237 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్లకు తుది గడువు ఈ నెల 4న ఉండగా..హర్దోవర్ కలన్ గ్రామంలో ఇలా వేలం పాటలో రూ. రెండు కోట్లకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు ఆత్మాసింగ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయగా, ఆయనకు పోటీగా ఇంకెవరన్నా నామినేషన్ వేస్తారా..అనేది వేచి చూడాలి.
సర్పంచ్ పదవికి రేటు రూ. 2 కోట్లు ?

- Advertisment -