- బెజ్జంకి దళిత సంఘాల విజ్ఞప్తి.
జనతా న్యూస్ బెజ్జంకి :సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు బెజ్జంకి మండలంలోని 23 గ్రామాల దళిత బంధు లబ్ధిదారులు సోమవారం ధర్నా నిర్వహించారు.రెండవ విడత మంజూరు అయిన దళిత బంధు నిధులు అసెంబ్లీ ఎన్నికల కోడ్ -2023 అమలులో ఉన్నందున తాత్కాలికంగా నిలిపివేసిన సందర్భంలో ఎలక్షన్ కోడ్ ముందు 3 లక్షల రూపాయలు కలెక్టర్ అకౌంట్ లోకి వచ్చిన సందర్భంలో మిగతా 7 లక్షలు కలిపి మొత్తం 10 లక్షల రూపాయలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, మంజూరు చేసి దళితుల అభ్యున్నతికి,సంక్షేమానికి కృషి చేయాలని కలెక్టరేట్ ముందు శాంతియుత ధర్నా నిర్వహించి, అడిషనల్ కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ కు వినతి పత్రం అందజేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బోనగిరి శ్రీనివాస్, మండల అద్యక్షులు దీటి బాల నర్సు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల అద్యక్షులు వడ్లూరి పర్శరాములు, ఆశప్ప పోచయ్య , జంగపల్లి పోచయ్య, బిగుల్ల సుదర్శన్,డీలర్ కిట్టు,తదితర లబ్ధిదారులు పాల్గొన్నారు.