కరీంనగర్ -జనత న్యూస్
తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 వరకు రైతుకు రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేయనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను నిన్న విడుదల చేసింది సర్కారు. రాష్ట్రంలో భూమి కలిగి ఉన్న కుటుంబానికి పంట రుణాల పథకం వర్తించనుంది
2018 డిసెంబరు 12 తేదీ నుండి 2023 డిసెంబర్ 9నాటికి రెన్యూవల్ అయిన, రైతులు బకాయి ఉన్న అసలు, వడ్డీ మాఫీ కానుంది.
కుటుంబానికి ఒకరికే ఈ రుణమాఫీ వర్తించనుంది. ఇందుకు రేషన్ కార్డు డాటా బేస్ ఆధారంగా లబ్ధిదారులను నిర్ణయిస్తారు.
రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల పంట రుణాలను మాఫీ చేయనున్నారు.
వ్యవసాయ కమీషనర్‌కు అధికారాలు..
రైతు రుణమాఫీ అమలుకు రాష్ట్ర వ్యవసాయ కమీషనర్, డైరెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించారు. ప్రతీ బ్యాంకులో ఒకరు నోడల్ అదికారిగా ఉంటారు. ఆ అధికారి వ్యవసాయశాఖ డైరెక్టర్ , జాతీయ సమాచార సెంటర్‌కు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ, లీడ్‌బ్యాంక్ అధికారుల సమన్వయంతో రుణమాఫీ అమలు అవుతుంది.
రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే..
2023 డిసెంబర్ 12 నాటికి రైతు తీసుకున్న బ్యాంకు అప్పు రెండు లక్షల కంటే ఎక్కువగా ఉన్నా అర్హుడే. రూ. 2 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, ఆ పైన ఉన్న అప్పును రైతు తొలుత బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత బ్యాంకు మొత్తం అప్పు మాఫీగా చేస్తుంది.
రూ. రెండు లక్షల కంటే ఎక్కువగా బ్యాంకు అప్పు ఉన్న కుటుంబంలో తొలుత మహిళల రుణాన్ని మాఫీ చేసి, ఆ తరువాత దామాషా ప్రకారం పురుషుల అప్పును మాఫీ చేస్తారు అధికారులు.
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ
స్వశక్తి గ్రూపులు, కంపెనీల ద్వారా, ఇతరాత్ర తీసుకున్న బ్యాంకు ఆప్పులకు రుణమాఫీ వర్తించదు. వీటిపై సందేహాలు తీర్చేందుకు అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఓ పరిష్కార విబాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఐటీ పోర్టల్, మండల స్థాయి సెంటర్లకు అనుసంధాన కర్తగా ఇక్కడి అధికారులు వ్యవహరిస్తారు. రైతుల ఫిర్యాదులను 30 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని తిరిగి దరఖాస్తు దారుడికి పంపాల్సి ఉంటుంది.
రూ. 2 లక్షల రైతు రుణమాఫీకి.. మార్గదర్శకాలు..
- Advertisment -